బోల్డ్ కంటెంట్ మూవీలో లేడీ సూపర్ స్టార్.

Published on Sep 15, 2019 10:48 am IST

వరుసగా లేడీ ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అత్యధిక పారితోషం తీసుకుంటూ సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నారామె. తెలుగులో ఆమె నటిస్తున్న సైరా కొరకు ఆరు కోట్లకు పైగా పారితోషకం అందుకున్నారని ఇండస్ట్రీలో టాక్. కాగా నేడు ఆమె మరో లేడీ ఓరియెంట్ తమిళ చిత్రం ప్రారంభించారు. నేటి ఉదయం చెన్నైలో అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభించడం జరిగింది.

నెట్రికన్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం బోల్డ్ కంటెంట్ తో రూపొందుతుందని అర్థం అవుతుంది. సెక్స్ మాఫియా, శృగారం, హింసా ప్రధానాంశాలుగా ఈ చిత్రం ఉండబోతుందని ఆ పోస్టర్ లోని వస్తువులు హింట్ ఇస్తున్నాయి. మరి పాత్ర కోసం ఎంతకైనా తెగించే నయనతారను నెట్రికన్ చిత్రంలో ఎలా చూడనున్నామో అని ఇప్పటినుండే ఆసక్తిపెరిగిపోయింది. మిలింద్ రౌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More