
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నయనతార, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు అద్భుతమైన హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ మధ్యే మాయ(మయూరి) సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను కట్టిపడేసిన నయన, తాజాగా ఈ దసరాకు విడుదలైన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకొని తమిళంలో టాప్ హీరోయిన్ పొజిషన్‌కు దగ్గరయ్యారు. విజయ్ సేథుపతి హీరోగా రూపొందిన ఈ సినిమా తమిళనాట సూపర్ కలెక్షన్స్‌తో, హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
తని ఒరువన్, మాయ, నానుమ్ రౌడీ దాన్.. ఇలా మూడు వరుస హిట్స్, అవికూడా సూపర్ హిట్స్ అందుకోవడం నయనతార కెరీర్‌కు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. నటిగా ఈ మూడు సినిమాల విజయంలో నయనతార పాత్ర కూడా మరవలేనిది. ఈ నేపథ్యంలోనే నయన ఇప్పుడు తమిళనాట క్రేజీ స్టార్‌గా అవతరించారు. ప్రస్తుతం మరో ఐదు ఇతర ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్న నయనతార కెరీర్‌కు ఈ హ్యాట్రిక్ హిట్స్ మరింత ఉత్సాహాన్ని ఇవ్వడంతో ఫ్యూచర్లో ఆమె నటించబోయే సినిమాలకు ఇప్పట్నుంచే క్రేజ్ తేవడంలో తోడ్పడుతున్నాయి.

