భారతీయుడు 2లో లేడీ సూపర్ స్టార్ ?

భారతీయుడు 2లో లేడీ సూపర్ స్టార్ ?

Published on Aug 28, 2018 10:38 PM IST

nayanatara
లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కలయికలో సూపర్ హిట్ చిత్రం భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రం కోసం లొకేషన్స్ వేటలో వున్నారు దర్శకుడు శంకర్. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కడప లో ఒక లొకేషన్ ని ఫిక్స్ చేశారట.

ఇక ఈచిత్రం నవంబర్ చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రంలో కమల్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార ను తీసుకోవాలనుకుంటున్నారట శంకర్. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుద్ సంగీతం అందిచనున్నాడు.

తాజా వార్తలు