నయనతారకు ఆరు కోట్లు కావాలట !

Published on Jun 28, 2021 2:01 pm IST

లేడీ సూపర్ స్టార్ నయనతార తొలిసారిగా బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ సినిమాలో జోడీ క‌ట్టేందుకు ఆమె రెడీ అవుతుందని ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. పైగా డైరెక్టర్‌ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని కూడా ఇప్పటికే కోలీవుడ్ మీడియా కన్ఫర్మ్ చేసింది. అయితే ఇప్పటివరకు దక్షిణాది చిత్రాలకే పరిమితమైంది నయనతార.

కాగా నయనతార గత ప‌ద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సౌత్‌ లో టాప్‌ హీరోయిన్‌గా దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు నయనతార రూ.3 కోట్ల వరకు తీసుకుంటుంది. కానీ బాలీవుడ్‌ డెబ్యూ కోసం భారీ రెమ్యునరేషన్‌ ను డిమాండ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూ.6 కోట్ల రెమ్యునరేషన్‌ ను అడుగుతుందట. నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :