కెరీర్ లో తొలిసారిగా డీ గ్లామర్ పాత్రలో నయనతార

కెరీర్ లో తొలిసారిగా డీ గ్లామర్ పాత్రలో నయనతార

Published on Jan 8, 2015 11:40 PM IST

nayanathara (1)
సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం కెరీర్ మంచి ఊపుమీద వుంది. ఈ అందాల ముద్దుగుమ్మ వరుసపెట్టి ఆసక్తికరమైన కధలను ఎంపిక చేసుకుంటుంది. వాటిలో ఒకటి ‘నానుం రౌడీదాన్’ అనే తమిళ చిత్రం. ఈ సినిమాలో నయన్ చెవిటి పిల్లగా నటిస్తుంది

ఈ సినిమాకు విజ్ఞేష్ శివన్ దర్శకుడు. పిజ్జా ఫేం విజయ్ సేతుపతి ప్రధానపాత్రధారి. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో వుంది. తన వంతు పూర్తిశాతం న్యాయం చెయ్యడానికి నయన్ కృషిచేస్తుంది. తన కెరీర్ లో నయన్ డీ గ్లామర్ రోల్ లో నటించడం ఇదే తొలిసారి

తాజా వార్తలు