దర్బార్ షూటింగ్ లో జాయిన్ కానున్న నయన్ !

Published on Apr 23, 2019 9:35 am IST

సౌత్ లో మరే ఏ హీరోయిన్ కు లేనన్ని ఆఫర్లతో బిజీ అయిపోయింది లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు వున్నాయి. అందులో సైరా , తలపతి 63,దర్బార్ చెప్పుకోదగ్గవి. ఇవి కాకుండా మరి కొన్నిప్రాజెక్టులను హోల్డ్ లో పెట్టింది.

ఇక నయన్ ఈ రోజు దర్బార్ షూటింగ్ లో జాయిన్ కానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్నఈ చిత్రం గత కొన్ని రోజులుగా ముంబై లో షూటింగ్ జరుపుకుంటుంది. ఏ ఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈయాక్షన్ ఎంటర్టైనర్ లో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా బాలీవుడ్ యంగ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :