మరొక ఆసక్తికరమైన పాత్రలో నయనతార !

15th, March 2018 - 09:00:30 AM

గ్లామర్ సినిమాలకు గుడ్ బై చెప్పి కేవలం కథా బలమున్న సినిమాలు మాత్రమే చేస్తున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈమె చేస్తున్న సినిమాల పట్ల అభిమానులు, ప్రేక్షకులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. దీంతో చాలా మంది దర్శకులు భిన్నమైన కథలతో ఆమెను అప్రోచ్ అవుతున్నారు. ఈమధ్యే ఆమె చేసిన ‘ఆరమ్’ తమిళంలో విజయం అందుకుని తెలుగులో రేపు ‘కర్తవ్యం’ పేరుతో విడుదలకానుంది.

ఇకపోతే ప్రసుతం ఈమె ‘కో కో’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో నయనతార దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతిగా కనిపించనుంది. ఒక బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలాంటి విపరీత పరిస్థితుల్లో చిక్కుకుంది, వాటితో ఎలా పోరాడింది అనేదే ఈ చిత్ర కథాంశం. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నెల్సన్ డైరెక్ట్ చేయనుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకానుంది.