డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన నయనతార లేటెస్ట్ మూవీ!

డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన నయనతార లేటెస్ట్ మూవీ!

Published on Dec 24, 2023 5:38 PM IST

Annapoorani

లేడీ సూపర్ స్టార్ నయనతార యొక్క మైలురాయి 75వ చిత్రం, అన్నపూర్ణి డిసెంబర్ 1, 2023న తమిళంలో విడులైంది. నూతన దర్శకుడు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ లో OTT అరంగేట్రం కోసం రెడీ అయిపోయింది.

అన్నపూర్ణి చిత్రం డిసెంబర్ 29, 2023న డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ముందుకి రానుంది. ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏమిటంటే, ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లను కూడా కలిగి ఉంటుంది. జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్‌ పై జతిన్ సేథి మరియు ఆర్ రవీంద్రన్ దీనిని నిర్మించారు. ఇందులో జై, సత్యరాజ్, కెఎస్ రవి కుమార్, రెడిన్ కింగ్స్లీ, అచ్యుత్ కుమార్, కుమారి సచ్చు, రేణుక, కార్తీక్ కుమార్ మరియు సురేష్ చక్రవర్తి ఉన్నారు.

తాజా వార్తలు