‘సైరా’ నుంచి నయనతార మోషన్ టీజర్ !

‘సైరా’ నుంచి నయనతార మోషన్ టీజర్ !

Published on Nov 18, 2018 12:12 PM IST

Nayanatara

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో నయనతార, మెగాస్టార్ సరసన నటిస్తోంది. ఈ రోజు, నయనతార పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా, సైరా చిత్రబృందం ఆమె మోషన్ టీజర్ ను విడుదల చేసింది. మోషన్ టీజర్ లో సాంప్రదాయ వస్త్రధారణలో మరియు అలంకరణలతో నయనతార లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది

ఇక ఇటీవలే జార్జియాలో జరుపుకున్న లాంగ్ షెడ్యూల్ లో కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను మరియు భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించింది చిత్రబృందం. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు