నయనతార ఓటు ఓటీటీకేనట

Published on May 18, 2021 11:02 pm IST

నయనతార చేస్తున్న కొత్త చిత్రాల్లో ‘నెట్రికన్’ కూడ ఒకటి. ఇది నయనతార చేస్తున్న పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రం. ఇందులో నయన్ అంధురాలి పాత్రలో కనిపించనుండి. కొరియన్ చిత్రం ‘బ్లైండ్’కు ఇది రీమేక్. ‘గృహం’ చిత్ర దర్శకుడు మిలింద్ రావ్ ఈ సినిమాకు దర్శకుడు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయిందట. రషెస్ చూసిన నయనతార అవుట్ ఫుట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిందట.

అంధురాలైన కథానాయిక తన వినికిడి శక్తిని ఉపయోగించి సీరియస్ కిల్లర్ ను ఎలా పట్టుకుంది అనేదే ఈ సినిమా కథ. ఈ చిత్రాన్ని నయన్ ప్రేమికుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకొద్ధి రోజుల్లో ముగియనున్నాయి. కానీ సినిమా హాళ్లు మూతబడి ఉన్నాయి. ఇంకో రెండు నెలలు తెరుచుకును సూచనలు కనిపించట్లేదు. అందుకే
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం.

సంబంధిత సమాచారం :