అజిత్ సినిమాలో నయనతార రోల్ ఇదేనట !

Published on Jul 2, 2018 4:24 pm IST

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రం చేస్తూ వస్తున్న నయన్ మధ్యలో స్టార్ హీరోల్ సినిమాలు కూడ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న పెద్ద హీరో సినిమా ‘విశ్వాసం’.

ఇందులో స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో నయనతార డాక్టర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘వివేగం, వేదాళం, వీరం’ శివ డైరెక్ట్ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడ ఈ చిత్రం ఒకే రోజున విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :