NBK 111: బాలయ్య ఊరమాస్ ట్రీట్.. ప్రీ లుక్ పోస్టర్ అదిరింది!

NBK 111: బాలయ్య ఊరమాస్ ట్రీట్.. ప్రీ లుక్ పోస్టర్ అదిరింది!

Published on Jun 7, 2026 6:04 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో బాలయ్య తన కెరీర్ 111వ సినిమా ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య మార్క్ స్పీడ్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు ముంబైలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేసుకుంటుంది.

అయితే బాలయ్యని ఈసారి నెవర్ బిఫోర్ లెవెల్లో ప్రెజెంట్ చేస్తుండగా మేకర్స్ అభిమానులకి ఇక వింటేజ్ ట్రీట్ కాదు అంతా కొత్త ట్రీట్ నే ఉంటుంది అని ఖరారు చేశారు. ఇలా ఆల్రెడీ ఈ జూన్ 10 బాలయ్య పుట్టినరోజు కనుక ట్రీట్ ని లాక్ చేసేసారు. మరి దీనిపై లేటెస్ట్ గా వదిలిన ప్రీలుక్ పోస్టర్ మాత్రం ఊరమాస్ లెవెల్లో ఉందని చెప్పాల్సిందే.

దీనితో కేజీ గుండ్లు కట్టిన ఇనుప గొలుసులు చేత్తో పట్టుకొని బాలయ్య ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. దీనితో గోపీచంద్ మలినేని గత వీరసింహా రెడ్డి కి కంప్లీట్ డిఫరెంట్ యాక్షన్ డ్రామాని ప్రామిస్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు