నాగబాబు పోస్ట్ కి బాలయ్య ఫ్యాన్స్ బూతు కామెంట్స్ !

Published on Jan 4, 2019 10:43 pm IST


గతంలో నాగబాబు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా మరవక ముందే ఆయన మళ్లీ బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ను టార్గెట్ చేశారు. నాగబాబు బయోపిక్ ను టార్గెట్ చేస్తూ ఓ కవిత రాసి తన పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసారు, ఇప్పుడు ఇది పెద్ద వివాదంగా మారింది.

నాగబాబు పోస్ట్ చేస్తూ.. ‘కట్టు కథలు కొన్ని, కల్పనలు ఇంకొన్ని చుట్టూ నెల, మూట కట్టనేల నిజం కక్కలేని బయోపిక్కులొద్దయ్యా, విశ్వదాభి రామ వినర మామ” అంటూ నాగబాబు చేసిన ఈ పోస్ట్ నందమూరి అభిమానుల్లో ఆగ్రహం నింపుతుంది. దాంతో బాలయ్య అభిమానులు ఈ పోస్ట్ కు ఎదురుదాడి చేస్తూ నాగబాబును అసభ్యకరంగా తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. వీటికి దీటుగా మెగా ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More