డబ్బింగ్ మొదలెట్టిన ‘బాలయ్య’ !

Published on Sep 20, 2019 6:17 pm IST

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ను శరవేగంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా డబ్బింగ్ ఈ రోజు శబ్ధాలయ స్టూడియోస్‌ లో మొదలైంది. బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ చేసిన సీన్స్ కి మాత్రమే ఈ డబ్బింగ్ చెబుతున్నారు. ఇక హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ చిత్రం అవుట్ ఫుట్ బాగా వస్తోందట.

ఇటీవ‌ల విడుద‌లైన బాలయ్య ఫస్ట్ లుక్‌ కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మరి రెండో లుక్ కి ఇక ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో చూడాలి. మొత్తానికి బాలయ్య లుక్స్ అండ్ గెటప్స్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More