‘బాలయ్య’ రెండో గెటప్ కూడా.. !

‘బాలయ్య’ రెండో గెటప్ కూడా.. !

Published on Sep 8, 2019 11:35 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘సినిమాలో బాలయ్య రెండు గెటప్ ల్లో కనిపించనున్నారని.. రెండో గెటప్ లో బాలయ్య ఇంకా యంగ్ లుక్ లో కనిపించనున్నారని చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల విడుద‌లైన బాలయ్య ఫస్ట్ లుక్‌ కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మరి రెండో లుక్ కి ఇక ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో చూడాలి. మొత్తానికి బాలయ్య లుక్స్ అండ్ గెటప్స్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు