సెన్సార్ నుండి ‘యు/ఏ’ పొందిన ‘నీజతగా నేనుండాలి’

Nee_Jathaga_Nenundaali
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన బండ్ల గణేష్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆషికి 2 సినిమాని ‘నీజతగా నేనుండాలి’ పేరుతో తెలుగులో రీమేక్ చేసారు, ఈ సినిమాని ఆగష్టు 22న రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే తెలిపాము. ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కి సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. అలాగే సెన్సార్ వారు సినిమా బాగుందని ఈ చిత్ర టీంని ప్రశంశించారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు రిలీజ్ చేస్తున్నందుకు ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ‘ఒరేయ్ పండు’, ‘మౌనమేలనోయి’ ఫేం సచిన్ హీరోగా, నజియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రవీంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి జీత్ గంగూలీ, మిథూన్, అంకిత్ కలిసి సంగీతాన్ని అందించారు. బాలీవుడ్ లో లానే తెలుగులో కూడా ఈ లవ్ స్టొరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటున్నారు.