నీది నాది ఒకే కథ విడుదల తేది ఖరారు ?
Published on Feb 25, 2018 7:16 pm IST

శ్రీ విష్ణు హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘నీది నాది ఒకే కథ’. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సాట్నా టైటస్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, దర్శకుడు దేవి ప్రసాద్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. నారా రోహిత్ అతిధి పాత్ర పోషించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా నాగేశ్వర్ రెడ్డి బొంతల ఎడిటర్ గా పనిచేసారు.

ఈ సినిమాను మర్చి 16న విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, రెండు పాటలకు మంచి స్పందన లభించింది. మెంటల్ మదిలో సినిమా తరువాత శ్రీ విష్ణు చేసిన సినిమా కావడంతో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనున్న ఈ సినిమా భారి ప్రీ రిలీజ్ ఫంక్షన్ మర్చి మొదటివారంలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 
Like us on Facebook