ఆదరణలో ఆకాశాన్ని తాకిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్’

Published on Jun 3, 2020 1:07 pm IST

బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా ఉన్న ప్రదీప్ మాచిరాజు 30రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. పీరియాడిక్ అండ్ సోషల్ లవ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో ప్రదీప్ రెండు భిన్న గెటప్స్ లో కనిపించనున్నాడని సమాచారం. విడుదల సిద్ధంగా ఉన్న ఈ మూవీ థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే విడుదల కానుంది.

కాగా ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ యూట్యూబ్ రికార్డ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటిపోయిన ఈ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ కి చేరుకుంది. ఓ చిన్న సినిమా అది కూడా విడుదల కానీ ఓ మూవీలోని సాంగ్ ఇంత ప్రభంజనం సృష్టించడం అనేది చెప్పుకోదగ్గ విషయమే. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ సాంగ్ ని స్టార్ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడారు.

సంబంధిత సమాచారం :

More