సీనియర్ నటి నీనా గుప్తా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్థిక ఇబ్బందుల వల్ల గతంలో తనకు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేసినట్లు, ఆ సమయంలో తాను చాలా ఇబ్బందులు పడినట్టు తెలిపారు. ఇంతకీ, ఏం మాట్లాడారు అంటే.. ‘నేను చేసిన కొన్ని పాత్రల విషయంలో చాలా బాధ పడ్డాను. నేను ప్రధాన పాత్రలో చేసిన కొన్ని సినిమాలు విడుదల కాకూడదని నేనే కోరుకున్నాను. షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్లిన తర్వాత వీటిని ఎందుకు అంగీకరించానా అని ఎంతో బాధ పడేదాన్ని’ అని ఆమె తెలిపారు.
నీనా గుప్తా ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాను. కొందరు దర్శకులు సెట్‌లో అవమానించారు. కొంతమంది దర్శకులు కారణం లేకుండా నన్ను అసభ్యపదాలతో తిట్టేవాళ్ళు. ఆ సమయంలో నాకు డబ్బు అవసరం కాబట్టి, తప్పక వాళ్ళ సినిమాల్లో నటించాను. ఒకవేళ ఆ సమయంలో వేరే చిత్రాల్లో అవకాశం వచ్చి ఉంటే నేను వీటిలో చేసేదాన్ని కాదు’’ అని నీనా గుప్తా కామెంట్స్ చేశారు.


