‘శాకుంతలం’లో ఇవి ప్రత్యేకమట

‘శాకుంతలం’లో ఇవి ప్రత్యేకమట

Published on Feb 3, 2021 1:50 AM IST

shakuntalam

డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పిరియాడికల్ మూవీ ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకున్న శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శాకుంతల పాత్రను స్టార్ నటి సమంత చేయనుంది. ఈ సినిమాను అన్ని విభాగాల్లోనూ గొప్పగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో గుణశేఖర్ పనిచేస్తున్నారు. భారీ సెట్లను వేస్తున్నారు. మణిశర్మ చేత మంచి బాణీలు చేయించుకుంటున్నారు.

అలాగే సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది కాబట్టి అప్పటి కాలాన్ని గుర్తుచేసేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయిస్తున్నారు. అందుకోసం ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీత లుల్లాను తీసుకున్నారు. నీత లుల్లా బాలీవుడ్లో పాపులర్ కాస్ట్యూమ్ డిజైనర్. శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ లాంటి ఎంతోమంది పెద్ద సెలబ్రిటీలకు దుస్తులు డిజైన్ చేశారు ఈమె. ‘మొహెంజొదారో, బాలగంధర్వ, దేవదాస్’ లాంటి సినిమాలోని కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో జాతీయ అవార్డులను అందుకున్నారు. అంత మంచి పనితనం ఉంది కాబట్టే ఆమెను ప్రాజెక్టులోకి తీసుకున్నారు గుణశేఖర్. నెలరోజుల నుండి ఈ సినిమా కోసం పనిచేస్తున్న నీత లుల్లా గట్టిగా సమంతతో పాటు ఇతర పాత్రలు కోసం ప్రత్యేకమైన, గొప్ప డిజైనింగ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు