హాట్ బ్యూటీ కి చిరుత సీక్వెల్ చేయాలని ఉందట

Published on May 22, 2020 1:44 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడు చరణ్ డెబ్యూ మూవీ చిరుత. 2007లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి సినిమాలోనే చరణ్ తన గ్రేసింగ్ స్టెప్స్, హై వోల్టేజ్ యాక్షన్ తో రెచ్చిపోయారు. కాగా ఇదే మూవీతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ నేహా శర్మ. మోడల్ గా కెరీర్ ప్రారభించిన నేహా శర్మ మొదటి చిత్రం చిరుత కాగా, రెండో మూవీ యంగ్ హీరో వరుణ్ సందేశ్ తో కుర్రాడు లో నటించింది.

ఆ చిత్రం తరువాత వరుసగా హిందీ చిత్రాలలో ఆఫర్స్ దక్కించుకొని అక్కడే సెటిల్ అయ్యింది. ప్రధాన హీరోయిన్ కాకపోయినా సెకండ్ హీరోయిన్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు వెళుతుంది నేహా. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అజయ్ దేవ్ గణ్ ప్రతిష్టాత్మక చిత్రం తన్హాజిలో ఓ రోల్ చేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతే రెచ్చిపోయే ఈ బోల్డ్ బ్యూటీకి తెలుగులో మరలా నటించాలని ఉందట. అది కూడా తన ఫస్ట్ మూవీ చిరుత సీక్వెల్ లో నటిస్తుందట. మరి ఈ భామ కోరిక మన్నించి పూరి, చరణ్ కలిసి చిరుత సీక్వెల్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More