నేల టికెట్టు మొదటి రోజు కలెక్షన్స్ !


రవితేజ నటించిన నేల టిక్కెట్టు మొన్న విడుదలై నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.9 కోట్ల షేర్ ని రాబట్టిందని సమాచారం . ఈ చిత్రానికి ఈ రోజు , రేపు కలెక్షన్స్ మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి . కానీ ఈ సోమవారం నుండి ఈ చిత్రం పెద్ద పరీక్షే ఎదురుకోనుంది.

ఎందుకంటే ఈ సినిమాకి ప్రేక్షకులనుండి విమర్శలు ఎదురవుతున్నాయి . సోగ్గాడే చిన్నినాయనా , రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్ సినిమాలు తీసిన కళ్యాణ్ కృష్ణ నేల టిక్కెట్టు లాంటి సినిమా తీయడమేంటని ఫిలిం నగర్ లో జోరుగా చర్చించుకుంటున్నారు .
నేల టిక్కెట్టు సినిమాని ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై రామ్ తాళ్లూరి నిర్మించగా మాళవిక శర్మ ఈ సినిమాలో కథానాయకిగా నటించింది .

Exit mobile version