ఇంటర్వ్యూ : రవితేజ – మా ‘నేల టిక్కెట్టు’ బాల్కనీ వాళ్ళ చేత కూడ విజిల్స్ వేయిస్తుంది !

ఇంటర్వ్యూ : రవితేజ – మా ‘నేల టిక్కెట్టు’ బాల్కనీ వాళ్ళ చేత కూడ విజిల్స్ వేయిస్తుంది !

Published on May 22, 2018 1:38 PM IST

మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేసిన సినిమా ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్బంగా రవితేజ మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం..

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
ఇందులో నాది ఒక అనాథ పాత్ర. ప్రతి మనిషిలోను ఏదో ఒక బంధాన్ని వెతుక్కునే మనిషిలా కనిపిస్తాను. ఎప్పుడూ జనాల మధ్యలోనే ఉండాలనేది సినిమాలో నా ఫిలాసఫీ.

ఈ చిత్రంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకుని అంశం ఏమిటి ?
ఇందులో పెద్దవాళ్ళ గురించి చెప్పడం జరిగింది. పెద్దవాళ్ళంటే చేతకానీ వాళ్ళు కాదు నిలువెత్తు అనుభవం అనే డైలాగ్ కూడ ఉంది. ఆ పాయింట్ నన్ను బాగా టచ్ చేసింది.

పవన్ కళ్యాణ్ కు, మీకు మధ్యన ఉన్న రిలేషన్ ఎలాంటిది ?
ఆయన చాలా సరదాగా ఉంటారు. నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడు కలిసినా బాగా మాట్లాడతారు.

ఈ సినిమాలో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునే అంశాలేవీ ?
ఇందాక చెప్పినట్టు పెద్దవాళ్ళ టాపిక్, మంచి ఫన్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, నా పాత్ర ఈ సినిమాలో హైలెట్ గా నిలిచే అంశాలు.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గురించి చెప్పండి ?
కళ్యాణ్ కృష్ణ చాలా మంచి దర్శకుడు. అతని సినిమాల్లో క్లాస్ టచ్, మాస్ టచ్ రెండూ ఉంటాయి. ఈ సినిమాలో కూడ అంతే. ఆయన ట్రీట్మెంట్ కనిపిస్తుంది.

ఇంతకుముందేమో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడేమో వరుస పెట్టి సినిమా చేస్తున్నారు. ఎందుకలా ?
దానికి ప్రత్యేకంగా కారణాలు లేవు. అప్పుడంటే కుదరలేదు. ఇప్పుడు అన్నీ కుదిరి వరుసగా సినిమాలు చేస్తున్నాను.

శ్రీను వైట్ల సినిమా నుండు అను ఇమ్మాన్యుయేల్ తప్పుకోడానికి కారణం ?
ఆమె మా సినిమాతో పాటు ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే సినిమా కూడ చేస్తోంది. మా సినిమాకి ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉండటం వలన ఆ సినిమాకు ఇబ్బంది కలుగుతుందని ఆమె తప్పుకున్నారు. తప్పకుండా ఆమెతో ఒక సినిమా చేస్తాను.

మీ అబ్బాయి ఏవైనా సినిమాలు చేస్తున్నాడా ?
లేదు. అసలు ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలోనే చేయాల్సింది. కానీ ఎగ్జామ్స్ ఉండటం మూలాన చేయలేకపోయాడు.

మీ నిర్మాత రామ్ గురించి మీ అభిప్రాయం ?
చాల మంచి వ్యక్తి. ఎప్పుడూ నిజాయితీగా, పాజిటివ్ గా ఉంటారు. ఆయనతో ఒక సినిమా కాదు ఇంకా ఇంకా సినిమాలు చేయాలని ఉంది.

మీ ‘నేల టిక్కెట్టు’ అందరినీ ఆకట్టుకోగలదా ?
ఖచ్చితంగా. మా సినిమా నేల టిక్కెట్టు వాళ్లనే కాకుండా బాల్కనీ వాళ్ళ చేత కూడ విజిల్ వేయిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే సినిమా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు