ఓవర్సీస్లో ఆదరణ దక్కించుకోలేకపోయిన ‘నేల టిక్కెట్టు’ !
Published on May 26, 2018 9:41 am IST

నిన్న విడుదలైన రెండు చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’ కూడ ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తొలిరోజు పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. ఇక ఓపెనింగ్స్ విషయానికొస్తే అవి కూడ తక్కువగానే ఉన్నాయని చెప్పాలి.

ఇక ఓవర్సీస్లో అయితే సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. విడుదలకు ముందు వేసిన ప్రీమియర్ల వసూళ్లు కూడ తక్కువగానే ఉన్నాయి. సుమారు 80 లొకేషన్లో ప్రదర్శించబడిన ఈ సినిమా కేవలం 32,280 డాలర్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. ఇది ఆయన గత చిత్రాలు ‘టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్’ ప్రీమియర్ వసూళ్లతో పోలిస్తే చాలా తక్కువ. ఇక చిత్రం లాంగ్ రన్లో ఎలాంటి పెప్రామెన్స్ కనబరుస్తుందో ఈ వీకెండ్ తరవాత తేలిపోనుంది.

 
Like us on Facebook