జూలై 12న ‘నేను లేను’ విడుదల !

Published on Jun 28, 2019 11:00 pm IST

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రలుగా ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి నిర్మిస్తున్న చిత్రం `నేను లేను`. `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహించగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యి యు/ఎ సర్టిఫికేట్ పొందగా జులై 12న ఈ సినిమా ని విడుదల అవుతుంది..

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ – ‘ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంత ప్రేక్షకులను ఉత్కంఠపరుస్తుంది. అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం: ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నిర్మాత : సుక్రి , రచన- దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.

సంబంధిత సమాచారం :

More