తమ ఓటిటిలో భారీ హిట్ కి సీక్వెల్ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఏంటా మిలట్రీ థ్రిల్లర్ సినిమా?

తమ ఓటిటిలో భారీ హిట్ కి సీక్వెల్ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఏంటా మిలట్రీ థ్రిల్లర్ సినిమా?

Published on Jun 3, 2026 8:04 AM IST

వరల్డ్ వైడ్ గా మంచి పాపులర్ అయినటువంటి దిగ్గజ స్ట్రీమింగ్ ఓటిటి సంస్థల్లో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. అయితే నెట్ ఫ్లిక్స్ నుంచి పలు గ్లోబల్ హిట్ సిరీస్ లతో పాటుగా పలు డైరెక్ట్ సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయ్యినవి ఉన్నాయి. ఇలా రీసెంట్ గా వచ్చి నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయ్యిన సినిమాకి సీక్వెల్ ని అధికారికంగా ప్రకటించారు. మరి ఆ చిత్రమే ‘వార్ మెషిన్’.

అలన్ రిచసన్ హీరోగా దర్శకుడు పాట్రిక్ హ్యూస్ తెరకెక్కించిన ఈ మిలట్రీ యాక్షన్ థ్రిల్లర్ ఆ మధ్య యాక్షన్ సినిమా లవర్స్ కి క్రేజీ ట్రీట్ ని ఓటిటిలో అందించింది. దీనితో ఈ సినిమాకి మేకర్స్ సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సీక్వెల్ ఇపుడు డెవలప్మెంట్ లో ఉందని అలాగే ఈ సినిమా తమ ఆల్ టైం టాప్ 10 సినిమాల్లో ఒకటని రివీల్ చేశారు. మరి ఈ పార్ట్ 2 ఏ లెవెల్లో ఉంటుందో చూడాల్సిందే. ఈ చిత్రం ఒక్క ఇంగ్లీష్ లోనే కాకుండా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. పార్ట్ 1 చూడకపోతే డెఫినెట్ గా నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయొచ్చు.

తాజా వార్తలు