సమంతను ఇరుకునబెట్టిన ఆ వ్యాఖ్యలు.

Samantha2

ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియాలో మనం మాట్లాడే మాట చేసే పనిపై అదుపు ఉండాలి లేకపోతే నెటిజెన్స్ కామెంట్స్ కి బలైపోవడం ఖాయం. ఇక సెలెబ్రిటీస్ పరిస్థితి ఐతే మరీ దారుణం. వారు సదుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని సార్లు సమస్యలు తెచ్చిపెడతాయి. సమంత ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితినే నెటిజెన్స్ నుండి ఎదుర్కొంటున్నారు. ఈనెల 23న నాగచైతన్య బర్త్ డే. ఈ సంధర్భంగా చైతు క్షేమాన్ని కాంక్షిస్తూ ఓ అభిమాని సింహాచలం గుడిమెట్లు మోకాళ్లపై ఎక్కి ఆ వీడియో తీసి సమంతకు ట్యాగ్ చేసి పంపించారు. దీనికి స్పందనగా సమంత అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఒకసారి మమ్ములి కలవని అని అతనికి రిప్లై ఇచ్చారు.

ఇదే నెటిజెన్స్ ఆగ్రహానికి కారణమైంది. ప్రాణాంతకమైన ఇలాంటి పనులు చేయవద్దు అని చెప్పాల్సింది పోయి, ప్రోత్సహించడమేమిటని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం నటిస్తున్న 96 మూవీ తెలుగు రీమేక్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ విడుదల కానుంది.

Exit mobile version