కాజల్ అసలు అందాలు చూపించి ప్రశంసలందుకుంటుందిగా…!

Published on Jun 2, 2019 2:00 am IST

సినీతారలు అలంకరణ లేకుండా అసలు బయటకాలుపెట్టరు. ఎక్కడ కెమెరా తో క్లిక్ మనిపించి తమ డీగ్లామర్ ఫేసెస్ ని బట్టబయలు చేసి మార్కెట్ దెబ్బతినేలా చేస్తారని భయపడతారు. . కానీ, కాజల్ ఆ సాహాసం చేసింది. మేకప్ లేకుండా దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘మేకప్‌ మనల్ని బాహ్యంగా అందంగా తయారు చేస్తుంది. అంతేకానీ మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని మారుస్తుందా?మనల్ని మనం స్వీకరించడంలోనే నిజమైన ఆనందం ఉంది’ అని కామెంట్ పెట్టారు.

మేక్ అప్ లేకుండా కాజల్ ఏమి బాగోలేదు.కానీ గ్లామర్ ప్రపంచంలో ఉండి అలాంటి ఫొటోలు షేర్ చేసిన ఆమె ధైర్ఘ్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ టైటిల్ రోల్ లో నటించిన ‘సీత’ సినిమా ఇటీవలే ప్రేక్షకులు ముందుకొచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. కాజల్ నటనకి మంచి గుర్తింపు లభించింది.

సంబంధిత సమాచారం :

More