ఇంటర్వ్యూ : అభిషేక్ నామ – ఇలాంటి కాన్సెప్ట్ తో ఇంతవరకు సినిమా రాలేదు.
Published on Jul 22, 2018 3:30 pm IST

శ్రీవాస్ దర్శత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ , పూజా హెగ్డే జంటగా అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. ఈనెల 27 న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానున్న సంధర్బంగా నిర్మాత అభిషేక్ మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

అసలు మూవీ కాన్సెప్ట్ ఏంటి సర్?

ఇండియన్ ఫిలిం హిస్టరీలో మొదటి సారి పంచ భూతాల మీద వస్తున్న మూవీ ఇది. ఎవరైతే తప్పు చేసినపుడు ఎవరు చూడకుండా చేసాం, ఆనందంగా తప్పించుకున్నాం అనుకుంటారు. కానీ కర్మ సాక్షి అనేది ఒకటి ఉంటుందని, దానినుండి తప్పించుకోవడం కుదరదనేది మెయిన్ కాన్సెప్ట్.

సినిమాలో సాంగ్స్ ఎలా ఉంటాయి?
అన్ని పాటలు బాగా వచ్చాయి. సినిమాలో ఏదో పాటలు క్రియేట్ చేసి పెట్టినట్లు కాకుండా, కథ ప్రకారం, సంధర్భానుసారం వస్తాయి. పాటల్లో కనిపించే లొకేషన్లు అందరిని ఆకట్టుకుంటాయి.

చూస్తుంటే సినిమాకి బాగా ఖర్చుపెట్టినట్లున్నారు?

అవునండి, సినిమా కథ డిమాండ్ మేరకే ఖర్చు పెట్టాము. సినిమాలో కాశి సీన్స్ ఉంటే, వాటిని హైద్రాబాద్లో తీయడం కుదరదు, ఎంత కష్టమైనా అక్కడికే వెళ్లి తీయాలి. అందువల్ల ప్రొడక్షన్ కాస్ట్ కొంచెం పెరిగింది.

మరి హీరో మార్కెట్ ని మించి ఖర్చుపెట్టారంటారా?

ఇప్పుడు ప్రెసెంట్ జెనెరేషన్ మూవీస్ లో హీరో, హీరోయిన్లు కంటే కంటెంట్ మెయిన్ కింగ్ అండి. హీరో మార్కెట్ విషయం పక్కన పెడితే మంచి కంటెంట్ వున్న సినిమాకి ఈ మాత్రం ఖర్చు కరెక్ట్ అనిపించింది. పెద్ద హీరోలని పెట్టి సరైన కథ, కథనాలు లేకపోతే సినిమా చూడరు కదా

బెల్లంకొండ శ్రీనివాస్ నే హీరోగా ఎలా ఎంచుకున్నారు?

మొదట ఈ సినిమా స్టోరీ ని శ్రీవాస్ గారు హీరో గారికి చెప్పాక వాళ్ళు నేను నిర్మాత అయితే బాగుంటుందని నన్ను వచ్చి కలిశారు. కథ నచ్చి మూవీ షూటింగ్ స్టార్ట్ చేసాం.

సినిమాలో గ్రాఫిక్స్ ఉంటాయా ?

అది కథ ప్రకారం కొన్ని సిట్యుయేషన్లో గ్రాఫిక్స్ వాడడం జరిగింది. మరీ ఎక్కువ గ్రాఫికల్ వర్క్ లేదు.

హీరో క్యారక్టర్ ఎలా ఉంటుంది, ఆయన ఎలా చేసారు?

హీరో క్యారెక్టర్ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. తన సినిమాల్లో శ్రీవాస్ తొలిసారి హీరోని చాలా డిఫరెంట్ గ చూపించారు. సాయి శ్రీనివాస్ గారు కూడా లవ్ సీన్స్ అప్పుడు చాలా స్టైలిష్ గా, అలానే ఫైట్ సీన్స్ అప్పుడు బాడీని బాగా బిల్డ్ అప్ చేసి నటించారు. ఆయన పాత్రలో వేరియేషన్స్ బాగా పలికించారు.

మీ అభిషేక్ పిక్చర్స్ కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుంది?

చాలా ప్లస్ అవుతుందని, కొత్త కాన్సెప్ట్ కాబట్టి తప్పకుండ వర్క్ అవుతుంది అని నమ్మకం ఉందండి.

హీరో క్యారెక్టర్ ఏంటి సినిమాలో?

సినిమాలో అయన ఒక వీడియో గేమ్ డిజైనర్ గా నటిస్తున్నారు. అయన పాత్రా సినిమా పట్ల ముందుకు వెళ్లేకొద్దీ మంచి ఆసక్తిని కలిగిస్తుంది.

గత సినిమా తో ప్లాప్ లో వున్న శ్రీవాస్ కి అవకాశం ఎందుకు ఇవ్వాలనిపించింది?

ఆయన ప్రీవియస్ మూవీ ‘డిక్టేటర్’ ఆ టైములో ఐదు సినిమాలతోపాటు విడుదలయింది. ఎందుకో ఆ సమయంలో ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు. కానీ ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకంతోనే ఆయనతో చేయడం జరిగింది.

సినిమాలో స్టార్ క్యాస్ట్ గురించి చెప్పండి?

మొత్తం 48మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. 4గురు విలన్స్ వున్నారు, అలానే మిగిలిన పాత్రల్లో చాలా మంది ప్రముఖ నటి నటులు నటించారు. తప్పకుండ వారందరు స్క్రీన్ పై గ్రాండ్ గా కనపడతారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook