చరణ్ చేతులమీదుగా విడుదల కానున్న ట్రైలర్ !

చరణ్ చేతులమీదుగా విడుదల కానున్న ట్రైలర్ !

Published on Aug 21, 2018 11:24 PM IST

Aadhi2

ఆది పినిశెట్టి, తాప్సి పన్ను, రితికా సింగ్ లు హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు హరినాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నీవెవరో’. ఇక ఆది పినిశెట్టి ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్ కు అన్నయ్య గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఈచిత్రం యొక్క ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు ఉదయం 11గంటలకు విడుదలచేయనున్నారు.

డిఫ్రెంట్ లవ్ స్టోరీ తో తెరకెక్కుతున్న ఈచిత్రానికి అచ్చు సంగీతం అందించారు. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎమ్ వి వి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఆగస్టు 24న ప్రేక్షకులముందుకు రానున్నా సంధర్బంగా చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

తాజా వార్తలు