బాలక్రిష్ణ సరసన కొత్త హీరోయిన్ !


గత వారమే ‘పైసా వసూల్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన బాలక్రిష్ణ తన 102వ సినిమాని కూడా వేగంగా నడిపిస్తున్నారు. ఆగష్టు ఆరంభంలో మొదలైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వాటిలో నయనతార ఒకరు కాగా రెండవ హీరోయిన్ గా మలయాళ నటిని తీసుకున్నారు.

ఆమె నటాషా దోషి. బాలయ్య సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు ఈమెను తీసుకున్నారు. ఈమె మలయాళంలో ‘హైడ్ అండ్ సీక్, నయన, కాల్ మీ @’ వంటి చిత్రాల్లో నటించారు. ఇక మూడవ హీరోయిన్ ఎవరనే విషయం కూడా త్వరలోనే తెలియనుంది. సీనియర్ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.