యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. ఆగస్ట్ 1 హీరో అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయనకి విషెష్ అందిస్తూ మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అశ్విన్ బాబు ఇంటెన్స్ లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది.
ఇటివలే భారీ బడ్జెట్ తో హైవోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ పూర్తి చేశారు. హై టెక్నాలజీని వాడి ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, VTV గణేష్, కీలక పాత్రలు పోహిస్తున్నారు.
ఈ చిత్రానికి గౌర హరి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.


