మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ఇటీవల న్యూఢిల్లీలో కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ‘పెద్ది’ పనులు ముగిసిన వెంటనే రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టనున్నాడు.
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి #RC17 అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ స్క్రిప్ట్ పనుల్లో పూర్తిగా లీనమై, కథను మరింత బలంగా మలుస్తున్నారని, ప్రీ-ప్రొడక్షన్ పనులు ముందుగానే వేగంగా సాగుతున్నాయని సమాచారం.
భారీ బడ్జెట్‌తో రూపొందనున్న #RC17 షూటింగ్ దాదాపు ఒక సంవత్సరం పాటు జరగనుందని తెలుస్తోంది. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ గతంలో ‘రంగస్థలం’ లాంటి మోడ్రన్ క్లాసిక్‌ను అందించడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించి అధికారిక అనౌన్స్‌మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.


