బాలయ్య కోసం కొత్త కాంబినేషన్ !

Published on Jun 3, 2021 6:00 pm IST

బాలయ్య బాబు హీరోగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఓ సరికొత్త సినిమా చేయడానికి సితార సంస్థ సన్నాహాలు చేసుకుంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎమోషనల్ డ్రామాతో పాటు పక్కా యాక్షన్ తో సాగే కొత్త నేపథ్యంలో బాలయ్య కోసం దర్శకుడు వెంకీ అట్లూరి ఓ కథ రాస్తున్నాడట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఇంట్రెస్టింగ్ న్యూసే.

ఇప్పటికే బాలయ్య, ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య జులై కల్లా అఖండను పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :