‘కరుప్పు’కు కొత్త పంచాయితీ.. అగ్గి రాజేసిన ఆ కామెంట్స్..!

‘కరుప్పు’కు కొత్త పంచాయితీ.. అగ్గి రాజేసిన ఆ కామెంట్స్..!

Published on Jun 5, 2026 8:09 PM IST

Karuppu

తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ రన్ కొనసాగిస్తోంది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లతో సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తుంది. ఈ చిత్రంతో సూర్య చాలా రోజుల తర్వాత ఓ సక్సెస్ అందుకున్నాడు.

అయితే, ఈ కథను దర్శకుడు మొదట విజయ్ చివరి సినిమా కోసం అనుకున్నానని చెప్పడం కోలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీసింది. ఇక్కడితో ఆగకుండా, ఈ సినిమాను విజయ్ చేసి ఉంటే రేంజ్ వేరేలా ఉండేదంటూ ఎడిటర్ కలైవనన్ చేసిన కామెంట్స్ సూర్య అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. విజయ్ వద్దు అనుకుంటేనే సూర్యకు ఈ అవకాశం వచ్చిందనే అర్థం వచ్చేలా ఉన్న ఆ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సూర్య, విజయ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదమే నడిచింది.

ఈ గొడవను గమనించిన హీరో సూర్య నేరుగా స్పందించకుండా, ‘ప్రేమతో ఉండండి’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఒక ట్వీట్ చేశాడు. ఇది అభిమానులను శాంతింపజేయడానికి మరియు వివాదానికి ముగింపు పలకడానికి ఉద్దేశించినట్లుగా సాగింది.

తాజా వార్తలు