‘మా’ అసోసియేషన్‌ కు రాజీనామా !

Published on Apr 19, 2019 4:30 pm IST

నెల రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు నరేష్‌ – శివాజీరాజీ ప్యానల్స్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగి.. చివరికీ ఆ పోటీలో మా అధ్యక్షుడిగా నరేశ్‌‌ శివాజీ రాజా పై 69 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నరేష్ తో పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా హీరో రాజశేఖర్ విన్ అయ్యారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా ఎస్. వి. కృష్ణారెడ్డి గెలిచారు.

కాగా ‘మా’లో మళ్లీ లొల్లీ మొదలయిందని.. ‘మా’లో నిధులు విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని.. దాంతో వైస్ ప్రెసిడెంట్ గా ఎస్. వి. కృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసారని, తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో కూడా ఉన్నారని కొన్ని రోజుల క్రితం మేం వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఎస్. వి. కృష్ణారెడ్డి తన వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసారని తెలుస్తోంది. కానీ ఈ వార్తకు సంబంధించి ‘మా’ నుండి ఇంకా ఎటువంటి అధికారికంగా ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :