‘క్వీన్’ తెలుగు రీమేక్ కు కొత్త దర్శకుడు !

Published on May 28, 2018 8:27 am IST

హిందీలో భారీ విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రాన్ని తెలుగు, తమిళము, మలయాళం భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళం, మలయాళం వెర్షన్ల షూటింగ్ జరుగుతుండగా తెలుగు వెర్షన్ మాత్రం మొదట అనుకున్న దర్శకుడు నీలకంఠ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆగిపోయింది.

తాజా సమాచారం మేరకు ఈ రీమేక్ యువ దర్శకుడు, ‘అ’ సినిమాతో తన ప్రతిభను చాటుకున్న ప్రశాంత్ వర్మ వద్దకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ఒక పెద్ద ప్రాజెక్ట్ ను చేయాల్సి ఉండగా దానికి ఇంకా టైమ్ పట్టేలా ఉండటంతో ఆయన కూడ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేసేందుకు సుముఖంగా ఉన్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మను కుమారన్ నిర్మిస్తున్న ఈ రీమేక్లో తమన్నా టైటిల్ రోల్ పోషించనున్నారు.

సంబంధిత సమాచారం :