‘అనుష్క’తో కొత్తరకం ప్రేమ కథ !

Published on Mar 21, 2021 7:48 pm IST

అనుష్క శెట్టి – నవీన్ పొలిశెట్టి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. కాగా ఒక వినూత్నమైన ప్రేమ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో కొత్తరకం ప్రేమ కథతో ఈ సినిమా సాగుతుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. మరి అనుష్క – నవీన్ కలయికలో సినిమా అనగానే ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాల పై మంచి అంచనాలు ఉన్నాయి.

కాగా చాలా మెచ్యూర్డ్ లవ్ స్టోరీని చూపించబోతుట్టు సమాచారం. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటో చూడాలి. ఇక నవీన్ పొలిశెట్టి సితార ఎంటర్‌మైనెట్స్ బ్యానర్‌లో ఒక సినిమా అలాగే మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీలో ఒక సినిమా చేయబోతున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
మొత్తానికి ‘జాతి రత్నం’ సినిమాతో నవీన్ పొలిశెట్టి స్టార్ అయిపోయాడు.

సంబంధిత సమాచారం :