చిన్న సినిమాల ఉనికి కోసం కొత్త ఆలోచన !

చిన్న సినిమాల ఉనికి కోసం కొత్త ఆలోచన !

Published on Jun 28, 2021 1:11 PM IST

చిన్న సినిమాలకు చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలకు భరోసాను ఇవ్వాలనే ఆలోచనతో త‌మిళ సినీ నిర్మాత‌ల మండ‌లి ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. తమిళ ఇండస్ట్రీలో 2015 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ.. షూటింగ్ పూర్తి అయి విడుద‌ల కాని సినిమాల జాబితాను సేకరిస్తారట. ఈ జాబితా పూర్తి అయ్యాక, త‌మిళ నిర్మాత‌ల మండ‌లి ఆధ్వ‌ర్యంలో ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని స్థాపించనున్నారు. అందుకోసం త‌మిళ సినీ నిర్మాత‌ల మండ‌లి సన్నాహాలు చేస్తోంది.

కాగా ఈ ఓటీటీ ద్వారా విడుదలకు నోచుకోని సినిమాల‌ను విడుద‌ల చేసి ఆయా సినిమాల వ‌ల్ల వ‌చ్చిన ఆదాయం మొత్తాన్ని ఆ సినిమాల నిర్మాత‌ల‌కే చెందేలా సరికొత్త ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు త‌మిళ సినీ నిర్మాత‌ల మండ‌లి సభ్యులు. నిజంగా ఇదొక గొప్ప నిర్ణ‌యం. తెలుగులో కూడా రిలీజ్ కానీ చిన్న సినిమాల‌కు చేయూత ఇవ్వాలి. తెలుగులోనూ ఇలాంటి ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ను తెలుగు నిర్మాత మండలి పెడితే బాగుంటుంది అని ఇక్కడ చిన్న నిర్మాతలు వేడుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు