ఇటీవల థియేటర్లలో విడుదలైన ఎమోషనల్ డ్రామా ‘శ్రీ చిదంబరం గారు’ ఓటీటీ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ చిత్రం ఈరోజే(ఫిబ్రవరి 19) ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. సినిమా థియేటర్లలోకి వచ్చిన కేవలం రెండు వారాలకే ఓటీటీలోకి వస్తుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, అనూహ్యంగా ఈ డిజిటల్ ప్రీమియర్‌ను ప్లాట్‌ఫామ్ వాయిదా వేసింది.
తాజా సమాచారం ప్రకారం.. ‘శ్రీ చిదంబరం గారు’ ఫిబ్రవరి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త విడుదల తేదీని ఈటీవీ విన్ అధికారికంగా ధృవీకరించింది. వంశీ తుమ్మల టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలోని కథ ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో సంధ్యా వశిష్ట హీరోయిన్‌గా నటించింది. తులసి, కల్పలత, గోపీనాథ్ తదితర నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు మరో వారం రోజుల్లో డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


