ఆకట్టుకుంటున్న ‘ఎన్ జి కె’ కొత్త పోస్టర్ !

Published on Dec 23, 2018 7:13 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘ఎన్ జి కె’ ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచ్చి లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఇక ఈ చిత్రం నుండి ఈరోజు సూర్య లుక్ ను విడుదల చేశారు. ట్రెడిషనల్ గెటప్ లో వున్న ఆ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో సూర్య రైతు సమస్యలపై పోరాడే రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రం తమిళ్ తోపాటు తెలుగు లో తమిళ న్యూ ఇయర్ రోజు ఏప్రిల్ 14న విడుదలకానుంది. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :