యూట్యూబ్‌లో ‘బాహుబలి’ మరో రికార్డ్!

యూట్యూబ్‌లో ‘బాహుబలి’ మరో రికార్డ్!

Published on Jun 17, 2015 7:59 PM IST

Baahubali-pposter
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం మొదట్నుంచీ సెన్సేషన్‌గా నిలుస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో గత నాలుగు నెలలుగా దుమ్మురేపుతున్న ఈ సినిమా, తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ మొదటి భాగానికి సంబంధించిన ఆడియో రిలీజ్‌ను గత శనివారం తిరుపతిలో వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే!

రాజమౌళి స్టైల్లో ఎంతో వైవిధ్యంగా జరిగిన ఈ ఆడియో ఈవెంట్‌ వీడియో యూట్యూబ్‌లో పెట్టిన నాలుగు రోజుల్లోనే పది లక్షల వ్యూస్‌తో రికార్డు నెలకొల్పింది. ఓ ఆడియో వేడుకకు సంబంధించిన వీడియోకు ఈ స్థాయిలో వ్యూస్ దక్కడం నిజంగా విశేషమే! ఇప్పటికే టీజర్, ట్రైలర్, ఆడియో జ్యూక్‌బాక్స్.. ఇలా యూట్యూబ్‌లో దుమ్మురేపుతూ వెళుతోన్న బాహుబలి, ఆడియో లాంచ్ విషయంలోనూ మరో రికార్డు కొట్టడం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్, అనుష్క, రానా,తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషల్లో జూలై 10న భారీ ఎత్తున విడుదల కానుంది.

తాజా వార్తలు