కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ హీరోగా చేసిన ఆఖరి చిత్రమే జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోద్, భగవంత్ కేసరి కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం విజయ్ సీఎం అయ్యాక విడుదల అయ్యింది కానీ అనుకున్న రేంజ్ లో అయితే వరల్డ్ వైడ్ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేయడం లేదు.
పైరసి, పైగా చాలా లేట్ అయ్యిన ప్రాజెక్ట్ కూడా కావడంతో పూర్తి స్థాయిలో ఆడియెన్స్ ఈ చిత్రం చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆడియెన్స్ ని రప్పించడానికి మేకర్స్ మరో ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమాలో 6 డిలీట్ చేసిన సీన్స్ ని త్వరలోనే యాడ్ చేయనున్నట్టు దర్శకుడు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది.
సో ఆ సీన్స్ ఏంటి ఎప్పుడు యాడ్ చేస్తారు అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇకవేళ యాడ్ చేసిన అవి సినిమాని సేవ్ ఎంతవరకు సేవ్ చేస్తాయి అనేది కూడా ప్రశ్నార్ధకమే.. సో దీనిపై మరింత క్లారిటీ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
