‘నీది నాది ఒకే కథ’కు థియేటర్ల పెంపు !

శ్రీవిష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’ గత శుక్రవారం విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి స్పందన దక్కించుకుని విజయపథంలో దూసుకుపోతోంది. రోజు రోజుకి చిత్రానికి ఆదరణ పెరుగుతుండటంతో ఏపి, తెలంగాణాల్లో ఇంకో 70 కొత్త థియేటర్లను పెంచారు. మొదటి వారాంతంలోనే చిత్రం ప్రాఫిట్ జోన్లోకి వెళ్లిందని నిర్మాతలు అంటున్నారు.

మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1.92 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం యొక్క హిందీ రైట్స్ రూ.40 లక్షలకు అమ్ముడుపోగా శాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడుపోవాల్సి ఉంది. నూతన దర్శకుడు వేణు ఊడుగుల నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి, కృష్ణ విజయ్ లు సంయుక్తంగా నిర్మించారు.