జనవరిలో సందడి చేయనున్న భారీ చిత్రాలు

జనవరిలో సందడి చేయనున్న భారీ చిత్రాలు

Published on May 12, 2015 10:13 PM IST

Pawan-Kalyan-Mahesh-Babu
ఏడాదికి ప్రారంభమనే కాక తమ కొత్త సినిమాలకు ఈ నూతన సంవత్సరమే సరైన విజయం అందిస్తుందన్న ఆశతో ఎన్నో చిత్రాలు జనవరిలో విడుదలవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకునే పనిలో చిన్నా చితకా నటుల దగ్గరనుండి బడాబాబులవరకూ ప్రయత్నం చేస్తుంటారు. వచ్చే జనవరి సైతం ఇందుకు మినహాయింపుకాదు. సినీ పరిశ్రమలో బడా స్టార్ల చిత్రాలు ఈ జనవరిలో విడుదలకాబోతుండడం విశేషం.

గత రెండేళ్ళగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటను రామ్ చరణ్ ప్రకటించారు. బివిఎస్ రవి కథను అందించగా.. పూరి డైరక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభించి.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ 99వ సినిమా ‘లౌక్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించనుండగా.. కోన వెంకట్, గోపీమోహన్, పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ కు బాలయ్య సినిమాలకు ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా జనవరిలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారట.

మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కలయికలో తెరకెక్కించనున్న ‘బ్రహ్మోత్సవం’ కూడా వచ్చే ఏడాది జనవరిలోనే అని రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. గతంలో వచ్చిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ కూడా జనవరిలోనే విడుదలై అభిమానులను అలరించింది.

ఇక త్వరలో సెట్స్ కు వెళ్ళనున్న పవన్ గబ్బర్ సింగ్ 2 మూవీని జనవరిలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘మా నాన్నకు ప్రేమతో’ అనే సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాను కూడా జనవరిలోనే విడుదల అవుతుందని తెలుస్తోంది. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ జనవరి అభిమానులకి పండగే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు