సైరా ప్రొమోషన్స్ భాగంగా నేడు మరొక ట్రైలర్ ని విడుదల చేశారు. దాదాపు ఓ నిమిషం పాటు సాగిన ఈ ట్రైలర్ బ్రిటీష్ దొరల దోపిడీని, అది వ్యతిరేకించిన నరసింహారెడ్డి తెగువను తెలిపేదిగా ఉంది. మొదటి ట్రైలర్ కి మించి ఈ వీడియోలో ఊపిరి సలపని పోరాటాలతో పాటు చిరంజీవి వీరోచిత నటనతో ఆకట్టుకుంది. ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించేలా చిరు చెప్పిన డైలాగ్స్ ఒళ్ళు గగుర్గొల్పేలా ఉన్నాయి. ఉత్కంఠ రేపేలా ఉన్న సైరా 2 ట్రైలర్ మూవీ అంచనాలను మరింత పెంచేదిగా ఉంది.
వచ్చే నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని ఐదు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు. చిరంజీవి కి జంటగా నయనతార, తమన్నా నటిస్తుండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు.
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


