ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (డ్రాగన్) (Dragon)అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ప్రస్తుతం జోర్డాన్ లో ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ అనంతరం.. ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్స్ తో పాటు రుక్మిణీ వసంత్ గ్లామర్ కూడా హైలైట్ గా ఉంటుందట. మరి ఈ సాంగ్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో చూడాలి. కాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట.
పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది.


