‘ఎఫ్ 3’ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్ !

‘ఎఫ్ 3’ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Feb 15, 2021 8:12 PM IST

F3
టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సారధి స్టూడియోలో శరవేగంగా జరుగుతోంది. వెంకీ వరుణ్ ల పై కొన్ని కామెడీ సీన్స్ తీస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. అయితే ఈ సీక్వెల్ లో కూడా త‌మ‌న్నా, మెహ‌రీన్‌లే క‌థానాయిక‌లుగా న‌టించబోతున్నారు.

వీళ్ళు వెంకీ వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి భార్యల టార్చరే ఎఫ్ 3 కథకు మెయిన్ మోటివ్ అని సమాచారం. ఇక ఈ జనరేషన్ లో కామెడీని హ్యాండిల్ చేయడంలో బెస్ట్ ఎవరు అనగానే ముందుగా అనిల్ రావిపూడి పేరే ముందువరుసలో ఉంటుంది. అంతగా అనిల్ టాలీవుడ్ లో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ సినిమాకి ఫుల్ డేట్స్ కేటాయించారు. ఇప్పటికే నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబులు నాలుగు నెలల్లో సినిమాని పూర్తి చేసి.. సమ్మర్ కు ఎఫ్ 3 రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు