సార్ హీరో కమల్ హాసన్, శంకర్ కలయికలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’ కి సీక్వెల్ రానుందని తెలిసిందే . భారతీయుడు 2 గా రానున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రోడుక్షన్స్ దశలో వుంది. ఈసినిమా లొకేషన్స్ కోసం ఇటీవల శంకర్ ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో పర్యటించారు. అక్కడ ఈసినిమా కోసం భారీ లొకేషన్ ను ఫిక్స్ చేసుకున్నాడట. అయితే ఈచిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ను మాత్రం ఫారిన్ కంట్రీ లో తెరకెక్కించనున్నాడట. ఆతరువాతే ఇండియాలో మిగితా షూటింగ్ జరుగనుందట.
నవంబర్ లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. పక్కా యాక్షన్ డ్రామా గా తెరకెక్కనున్న ఈచిత్రంలో నయనతార కథానాయికగా నటించనుండగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ,నేదుమూడి వేణు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుద్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి. ఇక ఈ చిత్రం తెలుగు తమిళ ,హిందీ భాషల్లో ఒకే సారి విడుదలకానుంది.


