“పుష్ప” కోసం మళ్ళీ తగ్గనున్న బన్నీ.?

Published on Jul 1, 2021 10:16 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం షూట్ కూడా ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కావడానికి రెడీగా ఉంది. మరి పలు కీలక సన్నివేశాలతో ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ కోసం మళ్ళీ బన్నీ గట్టి ట్రైనింగ్ తో పాటు స్టన్నింగ్ ఫిట్నెస్ లోకి కూడా మారనున్నట్టు తెలుస్తుంది.

అయితే “నా పేరు సూర్య” నుంచి “అల వైకుంఠపురములో” సినిమాకి బాగా బరువు తగ్గించుకున్న బన్నీ పుష్ప కి మరింత తగ్గి ఆశ్చర్యపరిచాడు. దీనితో బన్నీ మళ్ళీ సిక్స్ ప్యాక్ చేస్తున్నాడా అని ఊహాగానాలు వినిపించాయి. అయితే మరి ఇప్పుడు మళ్ళీ కాస్త బరువు తగ్గే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తుండంతో మరి ఏ సన్నివేశాల కోసమా అన్నది మరింత ఆసక్తిగా మారింది. ఇక ఈ సాలిడ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :